![]() |
![]() |
.webp)
ఇదేందయ్యా ఇది.. ఇది చూడ్లే అన్నట్టుగా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఓ సీక్రెట్ ని రివీల్ చేసేసింది. అసలు అలా ఎలా చెప్తుందంటూ నెటిజన్లు వాపోతున్నారు.
బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన దీపికా రంగరాజు. తన యూట్యూబ్ ఛానల్ రకరకాల వీడియోలను షేర్ చేస్తూ బిజీగా మారింది. బ్రహ్మముడి సీరియల్‌తో బాగా పాపులర్ కావడంతో.. దీపిక యూట్యూబ్ ఛానల్ అతి తక్కువ కాలంలోనే లక్ష పదహారు వేల మంది సబ్ స్క్రైబర్స్‌ని సంపాదించింది దీపిక. ఇక యూట్యూబ్ ద్వారా మంచి ఇన్‌కమ్ జనరేట్ కావడంతో.. ఫుల్ ఫోకస్డ్‌గా తన యూట్యూబ్ ఛానల్‌లో బ్యూటీ, హెల్త్, పర్సనల్ ఇలా రకరకాల వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా కావ్య తన యూట్యూబ్ ఛానెల్ లో " బిగ్ బాస్ కి వెళ్తున్నాను. బ్రహ్మముడి ఫ్యామిలీ రియాక్షన్ " అనే వ్లాగ్ చేసింది. తను చేసిన వ్లాగ్స్ లో బాగా పాపులర్ అయినవి కొన్ని ఉన్నాయి.. నా హైదరాబాదు రూమ్ టూర్, బ్రహ్మముడి సీరియల్ లో నా జర్నీ అలా మొదలైంది, సండే స్పెషల్ కి ఫ్రాన్స్ బిర్యాని ట్రై చేశాను వంటి వ్లాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.
దీపిక బ్రహ్మముడి సీరియల్ లో సంప్రదాయబద్ధంగా కూల్ అండ్ కామ్ గా ఉంటుంది. అయితే బయట చాలా యాక్టివ్ అండ్ ఫన్నీ గా ఉంటుంది. ప్రతీదానిని స్పోర్టివ్ గా తీసుకుంటూ వస్తున్న కావ్య కామెడి టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ మా పరివారం షోకి వచ్చినప్పుడు శ్రీముఖి, అవినాష్ లని దీపిక తన పంచులతో ఓ ఆట ఆడుకుంది. ఇప్పుడు తాజాగా చేసిన వ్లాగ్ లో బిగ్ బాస్ కి వెళ్తున్నట్టు అందరికి చాక్లెట్లు పంచింది కావ్య అలియాస్ దీపిక. దాంతో అందరు షాక్ అయ్యారు. ఇక అనామిక, అపర్ణ, ఇందిరాదేవి, ఇలా ఈ వీడియోలో అందరితో మాట్లాడిచ్చింది కావ్య. ఇక త్వరలో అనామికతో కలిసి పుష్ప2 సినిమాలోని 'సూసేకి ' పాటకి రీల్ కూడా చేస్తానని కావ్య అంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ కి కావ్య వెళ్తుందా లేదా అనే క్లారిటీ కోసం ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు. దాంతో ఈ వ్లాగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |